(తిమ్మాపూర్ డిసెంబర్ 06)
తిమ్మాపూర్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 265 లో చాలా సంవత్సరాల నుండి ఇల్లు నిర్మించుకొని ఇంటి నెంబర్ లేకుండా నివాసం ఉంటున్నారు. వారికి ఇంటి నెంబర్ లేని కారణంగా విద్యుత్ శాఖ వారు, వారికి కరెంట్ మీటర్ ఇవ్వడం లేదని అని అన్నారు.
వారికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వారు చీకట్లో ఉంటున్న ఇబ్బంది గుర్తించిన స్థానిక Questions నాయకులు పోలు రామ్, నగునూరి శ్రీనివాస్ తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ని కలిసి 265 సర్వే నెంబర్ లో నివాసం ఉంటున్న వారికి తాత్కాలిక లేదా శాశ్వత ఇంటి నెంబర్ ఇవ్వగలరని వినతిపత్రం అందజేశారు..
వినతి పత్రం ఇచ్చిన వారి వెంట పోలు రమేష్ , మాతంగి హరీష్, బొర్ర భూమయ్య ఉన్నారు..