కేరళలో జరుగుతున్న అండర్ 14 కృష్ణమూర్తి రాష్ట్రస్థాయి ట్రోఫీ 2 డే లీగ్ మ్యాచ్లలో గజ్వేల్ సీనియర్ క్రికెటర్ బాకీ స్వామి తనయుడు బాకీ ఇషాంత్ ప్రేమ్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ చాటాడు. రెండో మ్యాచ్ తమిళనాడు వర్సెస్ హైదరాబాద్ తో 92 బంతుల్లో 52 పరుగులు చేశాడు మూడో మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ పాండిచ్చేరి తో 142 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ సాధించి అజయంగా నిలిచాడు. నాలుగవ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ కేరళతో 9.3 బౌలింగ్ చేసి 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నారు. ఐదో మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ గోవా తో 75 బంతుల్లో 104 పరుగులు చేసి సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్ లో 12.2 బౌలింగ్ చేసి రెండు మెడిన్స్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్లలో బ్యాటింగ్ లో 290 పరుగులు మరియు బౌలింగ్ లో 12 వికెట్లు తీసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సెలక్టర్ లా దృష్టిని ఆకర్షించాడు.