రాయపోల్ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ఖుషి చేయాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పది తారీకు తర్వాత శక్తి కేంద్రాలలో సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షులు మాధసు వెంకట్ గౌడ్, జిల్లా నాయకులు రాజాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు స్వామి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు టెంకంపేట నర్సింలు, మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, కృష్ణ, సంతోష్ రెడ్డి, భూత్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, తిరుపతి, కృష్ణ, ఎల్లం, వెంకట్ గౌడ్, బాలమల్లు, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, వీరాచారి, మల్లేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.