సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ రెండవ వార్డులో పురపాలన శాఖ మంత్రి దుబ్బాక మునిసిపల్ ప్రతి వార్డ్ కు కోటి రూపాయలు మంజూరు చేసిన నిధులతో మంగళవారం జిల్లా మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సీ.సీ రోడ్డు పనులను కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి, దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి సీ.సీ రోడ్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మా వార్డు అభివృద్ధి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మా జిల్లా మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృషి వల్ల మా వార్డుని అన్నివిధాలుగా మా వార్డుని అభివృద్ధిలో ముందు ఉంచాం అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.యస్ వార్డు అధ్యక్షుడు దుబ్బాక రవి, బి.సీ సెల్ అధ్యక్షుడు బస్సబోయిన స్వామి, నాయకులు చెరుకు నర్సింలు, రాములు, కుమ్మరి ఎల్లయ్య, తొగుట నర్సయ్య, శ్రీను, సురేష్, గిరి, నిఖిల్, లత తదితరులు పాల్గొన్నారు.
