ముస్తాబాద్, ప్రతినిధి జూలై19, రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముందుగానే జరగగా ముస్తాబాద్ మండల సంఘసభ్యులు సముచిత నిర్ణయం చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సంఘసభ్యులే ప్రకటించారు. ముస్తాబాద్ మండల రెడ్డిసంఘం అధ్యక్షులుగా ఆవునూరు కుంభాల చిన్నమల్లారెడ్డి, నామాపూర్ గౌరవ అధ్యక్షులుగా కొండం రాజిరెడ్డి , డైరెక్టర్లు ఏడుగురు, ఉపాధ్యక్షులు ఆరుగురు, ప్రధానకార్యదర్శిగా కుంభాల గోవర్ధన్ రెడ్డి చీకోడు, సంయుక్త కార్యదర్శులు కరెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి (పాత్రికేయుడు) చికోడు, గుడికందుల మహేందర్ రెడ్డి కొండాపూర్, కోశాధికారి ఓలాద్రి ఆగంరెడ్డి చిప్పలపల్లి, కార్యవర్గ సభ్యులు ముగ్గురు ప్రసాద్ రెడ్డి ముస్తాబాద్, యాదగిరిరెడ్డి చికోడు, కరెడ్ల నిర్మల మహిళా కార్యవర్గ సభ్యురాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గతపది సంవత్సరాలకు పైచిలుకు మండల అధ్యక్షుడుగా మొర్రాయిపల్లి సర్పంచిగా ఎదిగిన రైతుబిడ్డ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుత సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి విధులు నిర్వహిస్తున్న నాయకుడు రెడ్డిసంఘం కులబాంధవులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. 




