*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*చీటింగ్ కేసులో రౌడీ షీటర్ రిమాండ్*
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ కుమార్ అనే వ్యక్తి *ఇల్లు అమ్మి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా బెదిరించిన* కేసులో మరియు *రామాంజనేయులు* అనే వ్యక్తికి *భూమి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని భూమి ఎక్కడున్నదో చూపెట్టకుండా తిప్పుతూ మరియు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన* మరొక కేసులో నిందితుడైన *రౌడీ షీటర్ కూనరపు మల్లేష్ s/o రాయమల్లు, వయసు: 54 సం.లు, కులము: బెస్త, వృత్తి: వ్యాపారం,r/o. గద్దె రాగడి అనునతడు రామకృష్ణాపూర్* పోలీస్ స్టేషన్ పరిధిలో అమాయక ప్రజలకు భూములను అమ్ముతూ, డబ్బులు తీసుకుని తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ, అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ, అమాయకపు ప్రజలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నా మూడు కేసులలో కేసులలో నిందితుడైన , రౌడీషీటర్ కూనారపు మల్లేష్ ను రామకృష్ణాపూర్ ఎస్ఐ జి. రాజశేఖర్ ఈరోజు తేదీ 15 .07.2024 రోజున అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా భూములు అమ్ముతాను అని చెప్పి డబ్బులు తీసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ అమాయకపు ప్రజలను పేతురింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేసి, మోసం చేసినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును అని రామకృష్ణాపూర్ ఎస్సై జి. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది.
