రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో జరుగుతున్న బీరప్ప కళ్యాణ మహోత్సవంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి పాల్గొన్నారు.
గ్రామం లో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బీరప్ప కామరాతి ల కళ్యాణంనిర్వహిస్తున్నారు.
బీరప్ప ఆలయాన్ని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.
బీరప్ప కళ్యాణానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ను, జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డిని, ప్రముఖులను యాదవ సంఘం సభ్యులు, కండువా తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసారు.
ఈ సందర్భంగా బీరప్ప ఆశీస్సులతో యాదవులు ప్రజలందరూ చల్లగా ఉండాలకోరారు.
ఇక్కడ ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య యాదవ్, సంకినేని రామ్మోహన్ రావు,జిల్లా యాదవ సంఘం నాయకులు గోట్ల ఐలయ్య యాదవ్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్,స్థానిక గ్రామ యాదవ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.
