చేతివృత్తులకు చేతినిండా ఉపాధి
– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి
మర్కూక్:
బిసి బంధుతో కులవృత్తి దారులకు చేతినిండా ఉపాధి ఉంటుందని, బిసిలు ఆర్థిక అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి అన్నారు. మర్కూక్ గ్రామానికి చెందిన మంగలి బిక్షపతికి బిసిబంధు కింద మంజూరైన లక్ష సహాయం చెక్కును శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు బిక్షపతికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సబ్బండ కులాల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే బీసీ బందు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బీసీ బంధు ద్వారా బీసీ కులాల్లో చేతి వృత్తుల వారికి లక్ష సాయం అందించడం జరుగుతుందన్నారు. దీంతో బీసీలు కుల వృత్తిదారులు ఆర్థికంగా ఎదగడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ఇలాంటి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. బీసీ బందు పథకం నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బందు ద్వారా లక్ష సహాయం అందుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పారు.
