కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారు: మంత్రి కొప్పుల ఈశ్వర్
సెప్టెంబర్ 21
జగిత్యాల సెప్టెంబర్ 21:దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం అని అడగడం ఆ పార్టీ దివాలాతనానికి నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు గురువారం ధర్మపురి నియోజకవర్గంలో ని పెగడపల్లి మండలం దీకొండ ల్యాగలమర్రి నంచర్ల గ్రామాల్లో మంత్రి పాదయాత్ర నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
నంచర్ల గ్రామానికి చెందిన బీజేపీ ఓసీబీ మోర్చా జిల్లా కార్యదర్శి హరిగోపాల్ కాంగ్రెస్ పార్టీ ఐదవ వార్డు సభ్యురాలు చేపూరి ఉమారాణి 20 మంది కార్యకర్తలు మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
