సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసి కార్యాలయం సి బ్లాక్ లో సోమవారం మున్సిపల్ ఇండోర్ , ఔట్ డోర్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందరి యోగక్షేమాలు కోరే అపార భగీరథడు, అలాగే సీఎం కెసిఆర్ మానస పుత్రిక కంటి వెలుగు కార్యక్రమం అని ప్రతి ఒక మున్సిపల్ సిబ్బంది కంటి పరీక్షలు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యా ధర్, వైస్ చైర్మన్ జాకీయుద్దీన్,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది, బిఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు