గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి
ఎల్లారెడ్డిపేట జనవరి 24 :
వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు,
దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, తల్లి దండ్రులను కోల్పోయిన వీరప్పన్ ను
బాపమ్మ లచ్చవ్వ తాత రామయ్య చేరదీశారు ,
ఇదే క్రమంలో ఈ ప్రాంతంలో సిపిఐ ఎం ఎల్ జనశక్తి, పీపుల్స్ వార్ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న క్రమంలో వీరప్పన్ పీపుల్స్ వార్ మధు దళనాయకత్వంలో కొద్ది రోజులు పని చేశాడు,
అనంతరం సిపిఐ ఎం ఎల్ జనశక్తి రాజన్న వర్గంలో ఆకర్షితుడయ్యాడు, సిపిఐ ఎం ఎల్ జనశక్తి
జంపన్న ,బాబాన్న, రణధీర్ దళాల్లో కీలకమైన బాధ్యతలతో దళ సభ్యునిగా పనిచేశారు, ఈ క్రమంలో నే జనశక్తి దళాల్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు, ఈ ప్రాంతంలో జనశక్తి లో సంచలనం సృష్టించిన వీరప్పన్ పై
అప్పటి కరీంనగర్ ఎస్పీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పలు కేసుల్లో నిందితుడైన వీరప్పన్ లొంగిపోడానికి తీవ్ర ఒత్తిడి చేయడంతో ఎస్సీ ఎదుట లొంగిపోయాడు ,
లొంగిపోయిన అనంతరం
కడు నిరుపేద కుటుంబ జీవనంతో గర్జనపల్లిలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వీరప్పన్ సామాన్య జీవితం గడిపాడు, ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు హేమను వివాహాం చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు, అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం లో బిఆర్ ఎస్ పార్టీ లో చేరిన దేవేందర్ గర్జన పల్లి ఎస్సీ మహిళా రిజర్వేషన్ స్థానం నుంచి బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గా అతని భార్య హేమ ను గర్జనపల్లి ఎంపిటీసీ గా పోటీకి దింపి విజయం సాధించాడు,
స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్న దేవేందర్ అతని భార్య హేమ కు బిఆర్ ఎస్ పార్టీ నాయకత్వాన్ని మెప్పించి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని కూడా సాధించిపెట్టగల్గాడు,
చిన్న తనంలో తల్లి దండ్రులను కోల్పోయిన దేవేందర్ ను పెంచి పెద్ద చేసిన బామ్మ లచ్చవ్వ గుండెపోటుతో మూడు రోజుల క్రితం మరణించింది ,కాగా
ఆమేకు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో , కులస్తులతో మూడు రోజుల కర్మ కార్యక్రామాలు చిన్నగా సోమవారం నిర్వహించిన దేవేందర్ రాత్రి 12 గంటల ప్రాంతంలో గుండెపోటుతో భాధపడుతుండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు,
అతనికి భార్య వీర్నపల్లి మండలం పరిషత్ ఉపాధ్యక్షురాలు హేమ , కూతుర్లు చారిక (9) పూరి (7) లున్నారు,
నిరుపేద కుటుంబంలో జన్మించిన దేవేందర్ అలియాస్ వీరప్పన్ అంత్య క్రియల నిర్వహనకు కుటుంబం దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి లో గ్రామస్తులు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు అంత్య క్రియలు నిర్వహిస్తున్నారు , ఆ నిరుపేద కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని గ్రామస్తులు బంధుమిత్రులు కోరుతున్నారు ,
