- కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో వేములవాడ సందీప్ పిల్లల హాస్పిటల్ యజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్, కొమ్ము స్వప్న దేవరాజ్, పాలకవర్గం, ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనియమని పిల్లల్లో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులకు సంబంధించి డాక్టర్స్ ను సంప్రదించాలని అన్నారు. ప్రతి గురువారంహాస్పిటల్లో ఫ్రీ ఓపి, చూడడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.డాక్టర్ లక్ష్మణ్ దీప్, మాట్లాడుతూ మా హాస్పిటల్ లో 24 గంటల వైద్య సౌకర్యం అందిస్తున్నామని అప్పుడే పుట్టిన పిల్లవాడినుండి 20సం వయస్సు గల వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.పిల్లల్లో కలిగే రక్తహీనత ,కడుపునొప్పి, థైరాయిడ్, ఫిట్స్, దగ్గు, దమ్ము, ఆకలి లేకపోవటం వట్టి వాటిగురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అమృత పిల్లల హాస్పిటల్ డాక్టర్ సురేంద్రబాబు, బలరాజ్,అడేపు,శ్రీను,సందీప్ హాస్పిటల్. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
