ప్రాంతీయం

వడ్ల కొనుగోలు కేంద్రాలలో త్వరితగతిన చేపట్టాలి అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ …

273 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్  అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ మండలంలోని చీకోడ్ , నామపూర్, పోతుగల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సగటు నాణ్యత ప్రమాణాలు ప్రకారం ధాన్యంను రైతులు శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోళ్లు వేగంగా జరుగుతాయని అన్నారు. రైతులు ఇందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని సాధ్యమైనంత వేగంగా రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రాల నిర్వహకులకు ఆదేశించారు.అనంతరం అదనపు కలెక్టర్ ముస్తాబాద్ లోని చిప్పల పల్లి లోని శ్రీమాన్ నారాయణ రైస్ మిల్, నామపూర్ లోని వీరంజనేయ రైస్ మిల్ ను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వాహనంలో రైస్ మిల్లకు వచ్చిన ధాన్యాన్ని వేనువెంటనే రైస్ మిల్లర్ లు యజమానులు అన్లోడింగ్ చేసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులెవ్వరు అధైర్యపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం  అన్నదాతలకు అండగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు. వీరి వెంట తహశీల్దార్ మునీందర్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *