రామకోటి సంస్థ ఆధ్వర్యంలో త్రికుటేశ్వర దేవాలయంలో రామ, శివ లిఖిత యజ్ఞం
భగవంతునికి మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి లేదు
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్జల్ డిసెంబర్ 30
సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు బండ లోని త్రికుటేశ్వర దేవాలయంలో సోమవారం నాడు రామ, శివ లిఖిత మహాయజ్ఞం జరిగింది. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో దాదాపు 100కు పైగా భక్తులు పాల్గొని రామ, శివ నామాలను లిఖించి, అక్కడే రామకోటి రామరాజు కి అందజేశారు.
ఈ సందర్బంగా రామకోటి రామరాజు మహా శివునికి ప్రత్యేక పూజలు చేసి 3గంటల పాటు భక్తులచే భజన చేయించారు. అనంతరం మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నారు. శృంగేరి పీఠం వారు ఈ మహాయజ్ఞం చేపట్టగా రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలో మమ్మల్ని కూడా బాగా స్వాములుగా చేసినందుగాను భక్తులు, దేవాలయం రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు కర్ణాల బాలకృష్ణ, రామగళ్ళ ప్రసాద్, గొడుగు స్వప్న, బాలమణి, బుధవ్వ, సీతారామ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
