- కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం శాలివాహన సంఘం భవనంలో వంగపల్లి శ్రీనివాస్, ఆధ్వర్యంలో శాలివాహన కుమ్మరి సంక్షేమ సంఘం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల నూతన కమిటీ అధ్యక్షునిగా వంగపల్లి పరశురాములు, ఉపాధ్యక్షులుగా ఇద్దగిరి రవి,గుమ్మడిదారి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వంగపల్లి దేవరాజు, కోశాధికారి బిక్కు నూరి భూమలింగం, ప్రచార కార్యదర్శి వంగపల్లి రామచంద్రం, ముఖ్య సలహాదారులు ఏనుగందులరాజయ్య, సలహా కార్యదర్శిగా వంగపల్లి శోభన్ బాబు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, నారాయణ, లింగం, రాములు, గోవర్ధన్, ముత్తయ్య, ప్రభాకర్, చంద్రయ్య, రవి, శ్రీనివాస్, రాములు,ను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
