ముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మండలంలోని10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులు ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి పదవ తరగతి వరకు బాల్యం వయసు దాటి కౌమార దశలో చేరుకొని వ్యక్తి తన స్థితిగతులను అనేకమైన మూలాలు మార్పులు ఈ దశలోనే మొదలవుతాయి ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు రాణించాలని ఉద్దేశంతో మొదటి అడుగు ఇక్కడే మొదలవుతుంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు కీలకమని అన్నారు.10వ తరగతి తర్వాత ఆ విద్యార్థికి ఉన్నటువంటి ఆకాంక్షను బట్టి ఉన్నత విద్యకు మార్గం ఏర్పడుతుందని అన్నారు. ఆమార్గాన్ని తానే ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు10వ తరగతి చదువుతూ పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్థులను ఉత్తీర్ణత సాధించి పై చదువులకు వెళ్లడాన్ని అభినందిస్తూ వీడ్కోలుసభ ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు.10వ తరగతి విద్యార్థులు 9వ తరగతిలో ఉన్న విద్యార్థులకు దిశ, నిర్ధేశం చేస్తూ వీడ్కోలుగా పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆపాఠశాల ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు విడిపోవడం ప్రతి కన్నులో కన్నీళ్లను తెస్తుంది. వీడ్కోలు సందర్భంగా పాఠశాలలో గడిపిన వారి అద్భుతమైన సంవత్సరాలను గుర్తు చేసుకున్నారు.
తమను విజయపథంలో నడిపించే వారి ఉపాధ్యాయుల నుండి వారి సహచరుల నుండి వారిని ఆశ్చర్యపరిచారు. సామర్థ్యాల కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టే విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు నుండి ఆశీర్వాదాల వర్షంతో వీడ్కోలు వేడుక ముగిసింది. ఈకార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ జ్ఞానచారి, గురుకుల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ స్వామి, రాకేష్ కుమార్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రముఖులు,
పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
