ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా ధ్వజారోహణం, విశ్వక్సేన పూజ ,కళ్యాణం, పూర్ణాహుతి, ఆలయ అర్చకులు,వారి పరిణయ ఘట్టాలను అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వందలాది భక్తులు హాజరయ్యారు. సందర్భంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటిసి గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, మాజీ ఉపసర్పంచ్ మారెడ్డి వెంకట్ రెడ్డి, బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, BRS గ్రామశాఖ అధ్యక్షులు ఎనగందుల నర్సింలు, కస్తూరి లింగారెడ్డి తదితరులు కళ్యాణ మహోత్సవానికి కనుల పండుగగా వీక్షించి పాత్రులైనారు.
