చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన న్యాత దేవయ్య (46) అనే వ్యక్తి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దేవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్రవాహనంపై ఓగులాపూర్ సమ్మక్క సారక్క జాతర కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న కుమారుడు శివ సాయి కాలు విరిగింది. దేవయ్య కు భార్య శోభ కుమారులు అజయ్, శివ సాయి ఉన్నారు. జోగాపూర్ లో ఉపాధి లేకపోవడంతో వేములవాడ నంది కమాను వద్ద నివాసం కడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచి మ్యాకల పర్శరాములు, ఎంపిటిసి మ్యాకల గణేష్ ప్రభుత్వాన్ని కోరారు. జోగాపూర్ గ్రామానికి చెందిన దేవయ్య తంగళపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జోగాపూర్ లో విషాదం నెలకొంది.
