నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న రాహుల్ గాంధీ.
ములుగు అక్టోబర్ 18
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపట్టనున్న బస్సు యాత్రను వీరు ప్రారంభిస్తారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్ ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభిస్తారు ఈ బస్సు యాత్రలో మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ పాల్గొంటారు యాత్రలో భాగంగా రైతులు మహిళలతో రాహుల్ సమావేశమవుతారు.
ములుగు భూపాలపల్లి జిల్లాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు.
19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు.
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్రను కొనసాగుతుంది ఆ రోజున ఆర్మూరులో పసుపు రైతులతో రాహుల్ భేటీ అవుతారు అదేరోజు బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్రలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో విడత బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపారు





