ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ :
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో ముదిరాజులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజు పిలుపునిచ్చారు,
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపురంలో ముదిరాజ్ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రనవేణి లక్ష్మణ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కుల సోదరులు ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు,
రాచర్ల తిమ్మాపూర్ అధ్యక్షులుగా జిల్లాల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా అబ్బెని హరీష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా కనమేని బాబు ముదిరాజ్, సహాయ కార్యదర్శిగా చాట్ల దేవరాజు ముదిరాజ్, కోశాధికారిగా కోలకానీ ప్రవీణ్ ముదిరాజ్, ముఖ్య సలహాదారుగా కొలకాని శేఖర్ ముదిరాజ్, రైటర్ గా జిల్లాల రాజు ముదిరాజ్ సలహాదారులుగా అల్లే అనిల్ ముదిరాజ్ లను ఎన్నుకున్నారు,
తిమ్మాపూర్ ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యులందరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ తెలిపారు,
