ప్రాంతీయం

సెస్ అభ్యర్థిని ఖరారు చేసిన బిఆర్ఎస్ పార్టీ…

132 Views

ముస్తాబాద్ డిసెంబర్ 13,  సెస్ ఎన్నికలలో మంత్రి కేటీఆర్ మండల ముఖ్య నాయకులతో సోమవారం ప్రగతి భవన్లో చర్చించి ఏకాభిప్రాయంతో  సెస్ డైరెక్టర్ అభ్యర్థిని ప్రకటించారు. సందుపట్లఅంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయడంతో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండంనరసయ్య, మండల రైతుబంధు అద్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జనాబాయి, సెస్ ఎన్నికల డైరెక్టర్ స్థానానికి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి సమిష్టిగా బిఆర్ఎస్ పార్టీ సభ్యులు కలసికట్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో సెస్ డైరెక్టర్ స్థానంను గెలుచుకొని జిల్లాలోని అన్ని మండలాలకు ఆదర్శంగా నిలవాలని మండల ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మేరుగు యాదగిరి గౌడ్, విజయ రామారావు, కొమ్ము బాలయ్య, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్