ప్రాంతీయం

నాకాబంది నిర్వహించిన పోలీసులు…

194 Views

ముస్తాబాద్,21 జూన్ (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం నాకాబంది మండలంలో నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో పోలీసు సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులతో పాటు అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకే నాకాబంది నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పకుండా వెహికల్ కు నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని సూచించారు. చలాన్ల బారిన పడకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్ దాచినా తొలగించినా, తప్పుడు నెంబర్ ప్లేట్లు ఉపయోగించినా కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని వెహికల్సు సీజ్ చేస్తామని పేర్కొన్నారు.  నేరాల అదుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7