ఎల్లారెడ్డిపేట జనవరి 26 :74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏ భూపేంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా గురువారం ప్రశంసాపత్రం అందుకున్నారు,
తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ భూపేంధర్ మాట్లాడుతూ
వీర్నపల్లి బ్రాంచ్ లో బ్యాంక్ సిబ్బంది మండలంలోని ఖాతాదారుల సహాకారంతో నే ప్రశంసాపత్రం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు,
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ భూపేంధర్ కు వీర్నపల్లి సెస్ డైరెక్టర్ మడుగుల మల్లేశం యాదవ్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు,
