విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల
విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రామ్ సాగర్ ఎస్సీ కాలనీలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివలింగం మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్య బోధనలు చేశారు. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి చక్కటి విద్య బోధనలు అందించారని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయని, తరగతి గది బోధన ఏ విధంగా ఉంటుందనేది విద్యార్థులకు అనుభవం కలుగుతుందని చెప్పారు. తరగతిగది బోధనలో ఉత్తిమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు తాము బోధించిన విషయాలను, ఉపాధ్యాయులుగా తమ అనుభవాలను పంచుకున్నారు. డిఈఓగా మన్నె హర్షిత, యంఈఓ భరణి, ప్రధానోపాధ్యాయులు గా పవిత్ర విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
