మండలం పరిధిలోని బేగంపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేస్తున్నటువంటి పిల్లర్ శుక్రవారం సాయంత్రం స్థానిక సర్పంచ్ ప్రవీణ్ అంబేద్కర్ ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసినటువంటి పనులను అడ్డుకొని అంబేద్కర్ కు ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ తొలగించడం సరైన పద్ధతి కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. ఈరోజు రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ ఈ విధంగా చేయడం పద్ధతి కాదని అన్నారు. సర్పంచ్ పై తక్షణమే చర్యలు తీసుకొని తమ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ విగ్రహం నిలబెట్టి తీరుతామని అన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం అనే నినాదంతో అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, మాల మహానాడు నాయకులు గ్రామస్తులు ఉన్నారు.




