పేసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్
కన్నాయిగూడెం,సెప్టెంబర్ 05
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధి కన్నాయిగూడెం మండలంలోని భూపతి పురం చిట్యాల గ్రామాల్లో పేసా గ్రామ సభలు జిల్లా పేసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ నిర్వ హించారు.ఇట్టి పేసా గ్రామ సభలకు కన్నాయిగూడెం ఎంపీడీఓ పణిచంద్ర ఎంపీఓ రామకృష్ణ సర్వాయి సర్పంచ్. శారదా ఎంపీటీసీ ఆలం నర్స క్క రాంబాబు పంచాయితీ కార్యదర్శి దబ్బకట్ల మనోజ్ లు హాజరై భూపతిపురంలోని 105 కుటుంబాలు 503 జనాభా పేసా గ్రామ సభకు హాజరై సర్వాయి గ్రామ పంచాయతీలో మాయొక్క గ్రామాన్ని కలపటం వల్ల గ్రామ పంచాయతీకి వెళ్ళ టానికి 20కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల గ్రామ పంచా యితీ వెళ్లలేకపోతిన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా కలిగిన గిరిజన గుడాలని గ్రామ పంచాయి తీలాగా చేశారు.కాబట్టి మాయొక్క గ్రామాన్నీ గ్రామ పంచాయతీగా చేయాలని పేసా గ్రామ సభ తీర్మానం చేయటం జరిగింది అదేవిదంగా సర్వాయి గ్రామ పంచాయతీలోని చిట్యాల మల్కాపల్లి గ్రామాల ప్రజలు129 కుటుంబాలు 512 జనాభా కలిగిన ప్రజలు అందరు కూడా సర్వాయి గ్రామ పంచాయితీలో ఉండటం వల్ల గ్రామ పంచాయితీ 15 కిలో మీటర్ల దూరం ఉండటం వల్ల పంచాయితీ వెళ్లలేకపోతి న్నామని గ్రామ పంచాయితీలో గ్రామ సభలు నిర్వహించి సందర్భంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవటం వల్ల వెళ్ళేకపోతున్నామని తద్వారా ప్రభుత్వం తీసు కువచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మా గ్రామానికి రావడంలేదని గ్రామ పంచా యితీగా చేయటానికి అన్ని రకాల యోగ్యత కలిగిన మాగ్రా మాన్ని గ్రామ పంచాయితీగా చేయాలని పేసా గ్రామ సభ ద్వారా తీర్మానం చేయటం జరిగింది.




