దౌల్తాబాద్: యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదని, యువతకు పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. మిరుదొడ్డిలో నిర్వహించిన కేపీఆర్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఎంపీ పాల్గొని ఫైనల్ విజేతలు మల్లాయపల్లి, రన్నరప్ మిరుదొడ్డి జట్లకు ఎంపీ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈటోర్నమెంట్ లో 65 క్రికెట్ జట్లు పోటీ పడ్డాయని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు..క్రీడలు అంటేనే ఉత్సాహంగా ఉంటుందని, క్రీడలతో మానసిక ఉత్సాహం తో పాటు శరీరం దారుడ్యం లభిస్తుందని ఆయన తెలిపారు.. ఈకార్యక్రమం విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు కుమార్ , ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరా చారి, క్రీడా మైదానం అందించిన తోట దుర్గారెడ్డి గారికి, ఎంసీఏ మిరుదొడ్డి సబ్యులకు, తదితరులకు ఈసందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.. భవిష్యత్తులో కూడా వేరే రంగాలలో కూడా ఎవరికైనా ఆలోచన ఉంటే కూడా నేను అందరికి సహకరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు..నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.. రాజకీయాల్లో యువతకు తగినంత ప్రోత్సాహం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు…
