సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేసి అనంతరం గుడాల శ్రీనివాస్ విజయ దపతుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి మాట్లాడుతూ అందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణుని బోధనలు అనుసరణీయమని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు, శ్రీకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్న అందరికీ శ్రీకృష్ణుని కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.
