కోనరావుపేట: వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జన్మదినం సందర్భంగా కోనరావుపేట మండల బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో జెడ్పి చైర్మన్ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోపు పర్శరాములు, గంగసాని రమణారెడ్డి, సిద్ధంశెట్టి శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటిసిలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
