దౌల్తాబాద్ : పీసీసీ కార్యదర్శి డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దౌల్తాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను కలిశారు. మినిస్టర్స్ క్వార్టర్లలో మంత్రులకు బొకేలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుద్దెడ స్వామి, బాలకృష్ణ, బుచ్చిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




