కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో తాను ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ కి ఎమ్మెల్యేగా ఉండి 9 సంవత్సరాలలో ఒక్క దళితుడికైనా న్యాయం చేయని ప్రభుత్వం కేసీఆర్ ది, దళితులను పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం దళితులందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వకుండా దళితులను ఆగమాగం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వార్డులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకి వచ్చింది వీళ్ళకు రాలేదని ప్రజలలో విభేదాలు సృష్టిస్తున్న నాయకులు బాధితులకు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రావడం, ఒకటో వార్డులో దళితులకు చాలామందికి రాలేదు, బాధితుల లిస్ట్ అవుట్ ఎవరు చేశారో వార్డులకు మరోసారి వచ్చి చూడాలన్నారు, రాజకీయాల కోసం డబుల్ బెడ్ రూములను బాధితులను విడిచిపెట్టి రాజకీయ నాయకుల వెంబడి ఉండే వారికి ఇవ్వడం ఏంటి అని అన్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ నాటకమా ? కౌన్సిలర్ల నాటకమా ? రాజకీయ నాటకమా ? రాజకీయాల కోసం చేస్తే రాజకీయ పుట్టగతులు ఉండవని, బాధితుల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.




