కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, గ్రామంలో సర్పంచ్ మంతెన సంతోష్ రెడ్డి,ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జన్మదిన వేడుకలను ఆయన ప్రతిమతో ఉన్న భారీ కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు పంచెలు, చీరలను పండ్లను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ జనం మెచ్చిన నేత జననేత వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, అని గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాభివృద్ధిలో ఎంతగానో సహకరించారని ప్రజలు మెచ్చిన నాయకుడు నిరంతరం ప్రజా సేవకుడు గొప్ప మనసు ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వేములవాడ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
