ముస్తాబాద్ ఫిబ్రవరి 5, (ప్రభన్యూస్) తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈరోజు ఎప్పటికప్పుడు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిముక రుచిని కలిగి ఉంటుంది. కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండలను కడతారు ఈత, తాటి మొదలైన చెట్లకు కుండలు కడ్తారు. కాని ముస్తాబాద్ మండలంలోని బట్టోనితాళ్లు గ్రామంలో ఏకంగా కూల్ డ్రింక్ బాటిల్స్ కట్టారు బాటసారులు ఇదేంటి నూతన పద్ధతులు పాటిస్తున్నారు గౌడ కులస్తులు అని తాటిచెట్టు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
