ప్రాంతీయం

ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్

131 Views

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశానుసారం శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం లోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాతామస్, డిఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రి కి తప్పనిసరిగా కావలసిన కోన్ని సూచనలు కలెక్టర్ తెలిపారు. నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు కలెక్టర్ కి మ్యాప్ ను చుపిస్తు పూర్తిగా వివరించారు. మొత్తం కలియ తిరిగారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలి. 1000పడకల ఆసుపత్రి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. నిర్మాణం లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా భవిష్యత్ అవసరాల ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలి. అందుకోసం వాహనాల పార్కింగ్ కి సంబంధించి ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. వాటర్ ఫెసిలిటీ కుడా భవిష్యత్తు అవసరాల అనుగుణంగా కెపాసిటీతో సంప్ ఉండాలి. రోడ్లు, బాక్స్ కల్వర్టు, హై ఓల్టేజ్ ఎర్ కండిషన్, సబ్ స్టేషన్ హై ఓల్టేజ్ ఉండాలి. సివిల్ వర్క్ త్వరగా పూర్తి చేస్తే మిగత పనులు చేయ్యడానికి వీలుంటుంది. ఎంవి పానేల్ బోర్డ, సిసిటివి ఎస్టిపి నిర్మాణ ఏజెన్సీ పైనల్ చేయ్యాలి. రెయున్ వాటర్ హర్వర్డ్ త్వరగా పూర్తి చేయ్యాలి. నిర్ణీత గడువు లోపు నిర్మాణం పూర్తి చేసి అందించాలని ఏజెన్సీలకు ఆదేశించారు. అనంతరం ప్రక్కనే నిర్మిస్తున్న కెంద్రీయ మెడికల్ స్టోర్ మరియు 50 పడకల ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్ లు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా అందివ్వాలన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ అహ్మద్, టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్ మరియు మెడికల్ కళాశాల సిబ్బంది ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *