కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామానికి చెందిన అల్లెపు లక్ష్మీ అనే ఒంటరి మహిళకు నా కలం అక్షర సత్యం ఫేసుబుక్ సోషల్ మీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్నెగూడెం గ్రామానికి చెందిన కటుకం ప్రసాద్ సుమ పెళ్ళిరోజు సందర్భంగా బుధవారం రోజున 25 కిలోల బియ్యం మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను నిమ్మపెల్లి గ్రామ సర్పంచ్ కదిరే శ్రీనివాస్, వట్టిమల్ల గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న – దేవరాజ్ చేతుల మిదిగా అందించారు. ఈ సందర్బముగా నా కలం అక్షర సత్యం టీం సభ్యుడు ఒడ్డెపల్లి రాజేంధర్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళ కావడంతో నిత్యవసర సరుకులు అందించామని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి సహాయంతో నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నా కలం అక్షర సత్యం టీం సభ్యుడు ఒడ్డెపల్లి రాజేందర్, గ్రామ వార్డు మెంబర్ పూజం లత రాజయ్య, యెనుగందుల స్నేహ లవన్ కుమర్, కొమ్ము నర్సయ్య, జెట్టి మహేంధర్, తదితరులు పాల్గొన్నారు.
