కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కోనరావుపేట క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎస్సై రమకాంత్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ పోకల రేఖ సంతోష్,ముఖ్య అతిథులుగా పాల్గొనిప్రారంభించారు. క్రీడలు శరీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని యువత ఫోన్లతో కాలక్షేపం చేయకుండా క్రీడల పై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నరసింహాచారి, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మాందాల శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
