ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

95 Views

– గ్రామ ల అభివృద్ధిలో రాజకీయాలు వద్దు

– బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులను ఎంపీ తెచ్చారు, మంత్రి తెచ్చారు , ముఖ్యమంత్రి అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు .దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు ఢిల్లీకి పోయి వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి దుబ్బాక అభివృద్ధికి తోడ్పడాలని కలవడం జరిగిందన్నారు. ముమ్మాటికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కృషి ద్వారా నిధులు మంజూరు అని అన్నారు.కానీ తెలంగాణ లో బిఆర్ఎస్ నాయకులు మేమే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ కి తెలుసు ఈరోజు గ్రామపంచాయతీలు ఏ నిధులతో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయో సర్పంచులకు తెలుసు అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీల సర్పంచ్ లు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లకు ఆరిగోస పెడుతూ పనిచేయమంటున్నారు. పనిచేసిన తర్వాత నిధులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో సర్పంచ్ లు ఉండడం బాధాకరం అని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామాలు బాగుండాలి ,పల్లెలు బాగుండాలి అనే నిదానంతో ముందుకు పోతున్నారు. పార్టీలకతీతంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అభివృద్ధి పథంలో దుబ్బాకను చూడాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే ఎక్కనీ గడపలేదు ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలవడానికి అపార్ట్మెంట్ తీసుకున్న అపార్ట్మెంట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు దుబ్బాకకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. వస్తే మాది రాకపోతే మీది అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గత ఆరు సంవత్సరాల్లో రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఒక్కనాడు కనబడని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు దుబ్బాక లోనే తిరుగుతూ ఉండడం బిజెపి పార్టీ నాయకుల వల్ల ఈరోజు దుబ్బాక లోనే తిరుగుతున్నారన్నారు. ఈరోజు గ్రామాలు చల్లగా ఉన్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందో ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నారు. దుబ్బాక అభివృద్ధి చెందుతుంది అంటే ముమ్మాటికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చోరువ తోనే అని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *