(మానకొండూర్ జనవరి 13)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి స్టేజి వద్ద జరుగుతున్న తోటపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం మిత్ర రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు పోలం మల్లేష్ యాదవ్ పరిశీలించారు..
అనంతరం గెలుపొందిన గొల్లపల్లి క్రికెట్ టీం క్రీడాకారులకు టీ షర్ట్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పొలం మల్లేష్ మాట్లాడుతూ..
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దుస్తులను అందించినట్టు తెలిపారు. యువకులు చెడు వ్యసనాల వైపు మరలకుండా, మంచి క్రీడా స్పూర్తితో పలు పోటీల్లో పాల్గొని రాణించాలని యువకులకు సూచించారు.