క్రీడలు

నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్

217 Views

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌,బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పై కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకుంది, వర్ష సూచన మేరకు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

ఈ టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు..నాలుగో విజయం కోసం బంగ్లాతో ఈరోజు తలపడనుంది, మ్యాచ్‌కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

కాగా, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింతే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ద‌క్కుతుంది. ఒక్క పాయింట్‌ వెనుకబడినా సెమీఫైనల్‌ రేసులో భార‌త్‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సైమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వర్షంతో బంగ్లా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే ఒక పాయింట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *