కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మూలవాగుపై, పెంటి వాగు పై బ్రిడ్జిల లను వెంటనే నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. పేంటు వాగు పై గత వర్షాలకు కొట్టుకపోయిన లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరముల నుండి వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పూర్తిగా ధ్వంసం అయినటువంటి బ్రిడ్జిలను వెంటనే నిర్మాణం చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, కు పలుమార్లు వినతి పత్రం సమర్పించిన ఆర్ అండ్ బి అధికారులకు పంచాయతీరాజ్ అధికారులకు దృష్టికి తీసుకు పోయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని ప్రజా అవసరాలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని కొట్టుకుపోయిన బ్రిడ్జిలను తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్న వైనాన్ని చూస్తే అధికారులు మొద్దు నిద్రలో ఉన్నట్టు కనిపిస్తున్నదని ఇట్టి బ్రిడ్జిలపై ప్రభుత్వం దృష్టి పెట్టలని ప్రజా ప్రతినిధులు నిధులు మంజూరు చేసిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు మాత్రం జరగడం లేదని ఏ ఎన్నికల వచ్చినా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఒకసారి 18 కోట్లు సాంక్షన్ అయినవి అని మరొకసారి 16 కోట్ల సాంక్షన్ అయినవి అని చెప్పడమే కానీ పని చేయకపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుందని ఇంకో ఐదారు మాసాలు అయితే మళ్లీ వర్షాకాలం వచ్చి ప్రజలను రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జిలను నిర్మాణం చేపట్టి ఈ ఆరేడు మాసాలలో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్, గొట్టే రుక్మిణి,భైరగోని నందు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, నాగండ్ల భూమేష్, రత్నాకర్, ఎక్కల దేవి శ్రీనివాస్, వైకుంఠం, యశోద, వేణు, తదితరులు పాల్గొన్నారు.
