కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని జై సేవాలల్ రెడ్డి తండా గ్రామంలో లంబాడీల ఐక్యవేదిక (లైవ్) జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని
ఉపాధి హామీ పథకం లేనిదే గ్రామ అభివృద్ధి లేదని
80 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు ఉపాధి హామీ బడ్జెట్ పడిపోయిందని నిత్యవసర సరుకులు బాగా పెరిగినవి కాబట్టి కనీసం రోజువారి కులి రూ 300కు పెంచాలని
ఒక జాబ్ కార్డ్ కింద 150 పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ దినోత్సవం పుష్కరించుకొని గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు గవర్నమెంట్ పే స్కేల్ జీతాలు అలాగే ఉద్యోగ భద్రత ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా సలహాదారుడు పాపారావు నాయక్, రాజు నాయక్, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
