రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ పాఠశాల లో జిల్లా విద్యా శాఖ ఆదేశానుసారం ఈ నెల 9 వ తేది నుండి జిల్లాలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడం జరిగింది అయితే ఉదయం 8:30 నుండి ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడం మూలంగా ఏమి తినకుండా మధ్యాహ్నం 1 గంట వరకు ఉండడం విద్యార్థులకు ఇబ్బందికరం కావున నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట 10 వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి వారికి ఎస్ ఎం సి చేర్మెన్ సిరిగిరి చంద్రమౌళి సహకారంతో ఇట్టి అల్పాహారం అందించడం జరిగింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ఇందుకు గాను పాటశాల తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు శ్రీ కోతింటి హన్మంత రెడ్డి కొలనురు వేణు పెద్దోళ్ల మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు ఆశ్ర తబస్సుం తాడురు సంపత్ కుమార్ మారెపల్లి రాజు దాసరి శ్రీధర్ గోల్కొండ శ్రీధర్ పాశం భాస్కర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
