అనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి – కుర్రె చక్రవర్తి, నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి.
ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రె చక్రవర్తి కలవడం జరిగింది.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో నస్పూర్ సీసీసీ ఎస్.ఐ నా పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమంగా మూడు తప్పుడు కేసులు నమోదు చేసి నా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని నాకు సీసీసీ ఎస్.ఐ నుండి ప్రాణ హాని ఉందని నాకు రక్షణ కల్పించాలని కుర్రె చక్రవర్తి జాతీయ ఎస్సీ కమిషన్ మెంబెర్ రాంచందర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం పై రామ్ చందర్ స్పందిస్తూ ఈ విషయం పై రామగుండం సీపీ తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
