– వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం
– మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్
రాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పేట సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి , మరియు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి వేడుకలను రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేదల పాలిటి పెన్నిధిగా నిలవడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందన్నారు. దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డినియోజకవర్గంలోని ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాల చేసింది ఏమీ లేదు అన్నారు. ముత్యం రెడ్డి హయాంలో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన ఘనత దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డికి దక్కిందన్నారు.
అంతేకాకుండా దుబ్బాక నియోజకవర్గం లో దివంగత నేత మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అపర భగీరథునిగా రైతుబంధువునిగా పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సహాయం చేసే దిశగా ప్రభుత్వాన్ని నడపడం జరిగిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఏర్పడిన తర్వాత మహిళలకు గృహలక్ష్మి అదే విధంగా గ్యాస్ 500 రూపాయలకు ఒక ఇంట్లో ఇద్దరు పెద్దమనుషులు ఉంటే 4000 రూపాయలు చొప్పున పింఛను ఇవ్వడం ఇవే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోను విడుదల చేయడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ముత్యం రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు బాగన్న గారి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇప్ప మల్లేశం, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పట్నం యాదగిరి, యూత్ నాయకుడు దయాకర్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రమేష్, మరియు సీనియర్ నాయకులు గొల్లపల్లి కనకయ్య,కృష్ణ, అనందం ,రాజేందర్ రెడ్డీ,వెంకటరెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామఅధ్యక్షులు నాయకులు పాల్గొనడం జరిగింది.





