*ఇందిర్గాం గ్రామస్తులతో సమావేశమైన శాసన సభ్యులు డా పాల్వాయి హరీష్ బాబు*
*బెజ్జూర్:* మండలం ఇందిర్గాం గ్రామంలో ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డా పాల్వాయి హరీష్ బాబు పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు కరెంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది.
*ఈ సందర్భంగా శాసన సభ్యులు డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ మీరు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని, కూరగాయలు పండించి మహారాష్ట్రకు తరలించి అమ్ముకునే మీకు తప్పకుండా అండగా ఉంటామని గ్రామస్తులకు తెలియజేశారు.*
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కోండ్ర మనోహర్ గౌడ్, మాజీ ఎంపిపి కొప్పుల శంకర్, మాజీ సర్పంచ్ వసీఉల్లఖాన్, సామల తిరుపతి, శ్రీనివాస్, తంగళ్లపల్లి నీలేష్, గడ్డం రాజేష్, నికాడి రమేష్, సామెర మహేందర్, కిషన్ గోపాల్ మరియు గ్రామస్తులు తిరుపతి, మోర్లే సంతర్, కావిడే దేవయ్య, నికాడి తిరుపతి, కొట్రంగి రమేష్, మోర్లె తులసిరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
