- వైభవంగా గోవిందరాజుల స్వామి కళ్యాణం
చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహల్లాద పర్వతంపై వెలసిన శ్రీ గోవింద రాజుల స్వామి వారి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు – శోభ లత దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ తంతు నిర్వహించారు. చైర్మన్ గోవిందరావు దంపతులు కన్యాదానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లింగంపల్లి కర్ణాకర్ దంపతులు కూడా స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. ప్రహల్లాద పర్వతంపై వెలసిన స్వామివారి కల్యాణానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్, జడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, ఎంపీటీసీలు మాదాసు వేణు, మ్యాకల గణేష్, సీఐ శ్రీలత, ఎస్ శ్రీకాంత్, సింగిల్విండో మాజీ చైర్మన్ ముకుందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు ఏగోళం శ్రీనివాస్, లింగంపల్లి రాజం, అమరేందర్ రెడ్డి, బొల్లిపెళ్లి నాగయ్య గౌడ్, కళ్యాణ వేడుకలకు గ్రామస్తులె కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.