ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు ఈ నెలలో శంకుస్థాపనలు

67 Views

అభివృద్ధి పనులకు ఈనెలలో శంఖుస్థాపనలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి.

మంచిర్యాల నియోజకవర్గంలో ఈనెలాఖరు లోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన లు జరుగనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నామన్నారు. శంఖుస్థాపన కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. అలాగే రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట కట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన జరుగుతుందన్నారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ వరకు గోదావరి నదిపై 375 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రంకు ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు. 164 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుంచి క్వారీ రోడ్, పాత మంచిర్యాల మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణంకు ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు.
ప్రతి ఒక్కరైతుకు రుణమాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అపోహలు వద్దని రైతులకు సూచించారు. సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఏ రైతుకు నష్టం జరగదని వివరించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఉంటుందని తెలిపారు. తాను ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచిర్యాల నియోజక వర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను, అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు. బీఆరెస్ నేతలు భూ ఆక్రమనదారులకు మద్దతు ఇవ్వడం శోచనీయమని అన్నారు.

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారఖ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈసమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్