బెల్లంపల్లి నియోజకవర్గం:
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఆర్పి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం.
ఈ సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ,మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గోవర్ ఫెడరేషన్ చైర్మన్ ,టిపిసిసి పరిశీలకులు, జంగ రాఘవ రెడ్డి, రాంభూపాల్ .
ముందుగా కాశ్మీర్ పహాల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ రాజ్యాంగ పరిరక్షణ భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేపించిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిపై మాజీ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఉన్నారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి పేదవాడికి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైనా అవకతవకలకు, పాల్పడితే ఎంతపెద్దవారైనా సహించేది లేదు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు అర్హులైన పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు అందించడమే నా లక్ష్యం అని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి నెంబర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
