ముస్తాబాద్ వెంకట్ రెడ్డి జనవరి 31, మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమంకొరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటుచేయాలని గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో గల్ఫ్ నాయకులు రాస్తారోకో చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5,లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తామని గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయిన తెలంగాణ బిడ్డలను ఇండియాకు పంపించేందుకు న్యాయ సహాయం చేసేందుకు ప్రతి దేశంలో గల్ఫ్ సెల్లులు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను
తుంగలో తొక్కారని రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు గడుస్తున్న ఇప్పటివరకు పైసామందం కార్మికుల సంక్షేమం కొరకు బడ్జెట్లో పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం ప్రవాసి భారతీయ బీమాయోజన పథకాన్ని గల్ఫ్ కార్మికులు ఎలా చనిపోయిన వర్తింప చేయాలని, హైదరాబాద్ లో గల్ఫ్ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ… ఈ సంవత్సరమైనా ఆఖరి బడ్జెట్ లో నైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ సంక్షేమ నిధిని కేటాయించాలని గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తేదీ 31౼1౼2023 నుండి 3౼2౼2023 వరకు గల్ఫ్ కార్మికుల నిరసనలు చెయ్యాలని గల్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (Gulf JAC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ధర్మేందర్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ MPTC గుండెల్లి శ్రీనివాస్, ఏల్లబాల్ రెడ్డి, మాజీ MPTC గజ్జేల రాజు, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
