ముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల గల చెక్కులను ముస్తాబాద్ లోనే 17 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఒక్కరోజు 34 పంపిణీ చేశారు .
నిన్నటి రోజున 40 చెక్కులను కలుపుకొని గత రెండు రోజుల్లో మొత్తం74 కళ్యాణలక్ష్మి చెక్కులని పంపిణీ చేశారు.
ప్రతీ కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు ప్రతి ఒక్కరికీ చీరను స్వయంగా ఎంపీపీ జనగామ శరత్ రావు అందించారు. ఈసందర్భంగా జనగామ శరత్ రావు మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మన కేసీఆర్ కే దక్కిందని అన్నారు.
అదేవిధంగా మనతెలంగాణ రాష్ట్రంలో పలుఅభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ప్రతి పేదింటికి ఓ తండ్రిలా.. ఓ పెద్ద కొడుకులా.. మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ముందుకు తీసుకెల్తున్నారని కొనియాడారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామరావు, రాష్ట్ర రజక సంఘము అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, మాజీ జడ్పీ కో ఆప్షన్ యండి. సర్వర్, కో ఆప్షన్ సభ్యుడు షాదుల్ పాప, ఎంపీటీసీ కంచం మంజుల నర్సింలు, పార్టీ యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, నాయకులు మట్ట రాజిరెడ్డి, కనమేని శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రావు, గుర్రాల రమేష్ రెడ్డి, గూడూరి భరత్, అన్వర్, ముత్యాల దేవేందర్, కోడె శ్రీనివాస్, బద్దీపడిగ నందు, ముక్క మల్లయ్య, రాంచంద్రం, వార్డు సభ్యులు బద్దీపడిగ నవీన, పల్లె సత్యం, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
